Nara Lokesh: సీఎం పదవిపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- మీడియాతో నారా లోకేశ్ చిట్‍చాట్..
- తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానం..
- ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: మహానాడు వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది.. మరోవైపు, లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే అభిప్రాయం కూడా గతంలో గట్టిగానే వినిపించింది.. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో నారా లోకేశ్ చిట్‍చాట్‌లో తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే అని అభివర్ణించారు.. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు నారా లోకేష్..
Read Also: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ‘చరిత’.. ఆమెకు మనోజ్ థాంక్స్?
Also Read
అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదు.. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయన్నారు లోకేష్.. వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెళ్తే పొగాకు రైతుల సమస్యలు తెలిశాయి. వెంటనే అధికారులను, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశాం.. పార్టీకి నిరంతరం ఫీడ్‍బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు.. కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతరం చర్చ జరగాలి.. పార్టీ బలంగా ఉండాలి.. సంస్థాగతంగా బాగుండాలని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
Read Also: Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..
ఇక, మహానాడులో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం చేయాలి. అందుకే ప్రతివారికి న్యాయం చేసేలా సోషల్ రీ ఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. తెలుగుజాతి విశ్వఖ్యాతి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో నెం. 1 స్థానంలో ఉండాలి. అన్నిరంగాల్లో మన తెలుగువారే ముందుండాలి. దీనినే అజెండాగా పెట్టుకొని మనం పనిచేయాలన్నారు.. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. మనరాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు. అన్నిరంగాల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే యువగళం లక్ష్యంగా పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!