Lalitha Jewellery: ఈనెల 5న కడపలో లలితా జ్యువెల్లరి బ్రహ్మాండమైన ప్రారంభం..
- ఈనెల 5న కడపలో లలితా జ్యువెల్లరి బ్రహ్మాండమైన ప్రారంభం
- ఇది లలితా వారి 56వ షోరూం
- తయారీ ధరకే బంగారం
- వజ్రాభరణాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి.. ఇప్పుడు తన 56వ షోరూంను కడపలో ప్రారంభిస్తోంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. తద్వార ప్రజలు పెద్దమొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయొచ్చు!.. అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోనే ఇతర షోరూంలలో లభించని సరికొత్త ‘బంగారు నగల కొనుగోలు పథకం’ను కూడా అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆధరణను పొందింది లలితా జ్యువెల్లరి.. ఇప్పుడు కడప మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సర్వం సిద్ధమైంది. అక్టోబరు 5వ తేదీన ఇక్కడ కొత్త షోరూం ప్రారంభం కానుంది. అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో, వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంలను ఆరంభిస్తుండటం మరింత విశేషం.
“వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, గుంటూరు, శ్రీకాకుళం, గోపాలపట్నం, అనకాపల్లి, గాజువాక, విజయనగరం, అనంతపురం, ఒంగోలు, కర్నూలు, నరసారావుపేట, అమలాపురం, నిజామాబాద్, హైదరాబాద్‌లోని కూకట్పల్లి, సోమాజిగూడ, దిల్‌సుఖ్ నగర్, చందానగర్, సుచిత్రాసర్కిల్ షోరూంలకు ప్రజల నుంచి దక్కిన విశేష ఆధరణను చూసి.. దక్షిణభారతదేశం వ్యాప్తంగా మా సేవలు విస్తృతం చేయాలనుకుంటున్నాం. కడప, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు మా ఇతర షోరూంలకు వచ్చి నగలు కొన్నారు. అందువల్లే మేం ఇక్కడ కొత్త షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని చెబుతున్నారు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఎం.కిరణ్ కుమార్.
Also Read
కడప: కోటిరెడ్డి సర్కిల్, కడప కేఫ్, రైల్వేస్టేషన్ రోడ్ అనే చిరునామాలో అక్టోబరు 5న ఉదయం 10.00 గంటలకు అతిథుల సమక్షంలో ప్రారంభోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ ప్రారంభోత్సవంలో.. రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి (టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప), ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం..
ప్రారంభోత్సవ ఆఫర్: ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు.. అదేవిధంగా వజ్రాభరణాలు క్యారెట్ కు రూ.5000 తగ్గింపు ఇవ్వనున్నారు. ఈ ఆఫర్ అక్టోబరు 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రమే. లలితా జ్యువెల్లరి అందిస్తోంది సరికొత్త.. ‘ధన వందనం’ 11 నెలల నగల కొనుగోలు పథకం..! వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారు కష్టపడి సంపాదించిన డబ్బు మరింత ఆదా అవ్వాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త నగల కొనుగోలు పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో విశేషం ఏంటంటే మీరు నెలనెలా కట్టే డబ్బు బంగారంగానూ ఆదా చేసుకోవచ్చు, డబ్బుగానూ ఆదా చేసుకోవచ్చు. ఏ నగ అయినప్పటికీ 50% తరుగే లేదు. అలాగే ఒక నెల ఇన్స్టాల్మెంట్లో 50 శాతం బోనస్ కలదు. కస్టమర్లు రూ.1000 / రూ.1500 / రూ.2000 / రూ.2500 / రూ.5000 / రూ.10000.. వంటి వాయిదాలలో ఈ పథకంలో చేరి లబ్ది పొందవచ్చు.
అద్భుతమైన అవకాశం!
లలితా జ్యువెల్లరి షోరూంలలో మార్కెట్ కంటే తక్కువ తరుగులో బంగారు నగలను అందజేస్తాం. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని డబ్బును ఆదా చేయాలని కోరుతున్నాం.
ధరలు పోల్చి కొనండి! వినియోగదారులకు లలితా జ్యువెల్లరి ఓ అపూర్వ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక్కడ తమకు నచ్చిన నగను ఫొటో తీసుకుని, అందుకు ఎస్టిమేట్ స్లిప్ను తీసుకోవచ్చు. ఈ రెండింటిని పెట్టుకుని నాలుగైదు షోరూంలలో ధరలు పోల్చి చూడొచ్చు. అప్పుడు ఎక్కడ ధరలు తక్కువగా ఉన్నాయో అక్కడ కొనొచ్చు.
కస్టమర్ల కోసం..
న్యాయమైన విక్రయాలు, విస్తృతమైన నగల కలెక్షన్లతో పాటు కస్టమర్లకు అవగాహన కల్పించి.. వారిలో సాధికారతను నింపాలని భావిస్తున్నాం. ‘నాకు షో బిజినెస్పై ఆసక్తిలేదు. కానీ.. కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ కావాలని అనుకుంటున్నా. అందుకే.. నా ప్రకటనలన్నీ కస్టమర్లకు మరింత అవగాహన కల్పించే విధంగానే ఉంటుంది. సాధారణంగా నగల విక్రయరంగంలో పారదర్శకత, ఫెయిర్ నెస్ ఉండదు. కానీ వాటిని మార్చాలని భావిస్తున్నా’ అని చెబుతున్నారు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఎం.కిరణ్ కుమార్.
ఆశ్చర్యపరిచే, అద్భుతమైన నాణ్యత..
నాణ్యమైన నగలు విక్రయించడం, పారదర్శకమైన విధానాన్ని లలితా జ్యువెల్లరి అనుసరిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అది మాత్రమే మా ప్రత్యేకత కాదు.. విస్తృతమైన కలెక్షన్లు కూడా మా ప్రత్యేకత. చెయిన్, గాజులు, నెక్లస్, చోకర్స్, హారం, వంకీ, ఒడ్డాణం, ఉంగరాలు, కమ్మలు, జుమ్కీలుతో పాటు పలురకాల నగలు లక్షలాది సంఖ్యలో మా కొత్త షోరూంలలో ఉన్నాయి. దేశంలోనే అతితక్కువ ధరకు వజ్రాభరణాలు లభ్యమవుతాయి. అన్ని వజ్రాభరణాలు ఈ-ఎఫ్ కలర్డ్, వీవీఎస్ క్లారిటీతో ఉంటాయి. నాణ్యత తక్కువైన జీ-హెచ్ కలర్రేడ్లను మేం విక్రయించం. అన్ని వజ్రాభరణాలకు మార్పిడికైతే 100% బైబ్యాక్ ఉంది. బంగారంగా 90% లేదా డబ్బుగా అయితే (మార్చుకునే రోజునాటి లలితా జ్యువెల్లరి ధర ప్రకారం) 85% బైబ్యాక్ లభిస్తుంది. అలాగే కనువిందు చేసే సంప్రదాయ మరియు వినూత్నమైన 99 % వెండి వస్తువులకు తరుగు లేదు. మార్కెట్ కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
చైర్మన్ మార్గనిర్దేశంతో..
‘నేను చాలా పేద కుటుంబంలో జన్మించా. అంతేకాకుండా సాధారణ వ్యక్తికి సరైన ధరలో నగలు కొనడమనేది ఓ పెద్ద ఛాలెంజ్ అనే విషయం నాకు బాగా తెలుసు. నగల రంగంలో ఉచితాలు, బహుమతులు, డిస్కౌంట్ల పేర్లతో కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు విలువ నాకు బాగా తెలుసు. అందుకే కస్టమర్లకు నేను అవగాహన కల్పిస్తుంటా’నని చెబుతున్నారు డాక్టర్ కిరణ్ కుమార్.
అదనపు వివరాలకు సంప్రదించగలరు:
లలితా జ్యువెల్లరి, కడప: రైల్వేస్టేషన్లోడ్, కడప కేప్, కోటిరెడ్డి సర్కిల్. 5: 8925848142 /43.

తాజావార్తలు
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?