Site icon NTV Telugu

MLA PA Blackmail: వెలుగులోకి ఎమ్మెల్యే మాధవి పీఏ లీలలు.. ఒకరితో పెళ్లి.. ముగ్గురు యువతులను ట్రాప్‌ చేసి..!

Mla Pa Blackmail

Mla Pa Blackmail

MLA PA Blackmail: తెలుగుదేశం పార్టీ నేత, కడప ఎమ్మెల్యే మాధవి పీఏ వాహిద్‌ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న వాహిద్‌.. ఆ తర్వాత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు.. భార్య అయిన తనతో వ్యక్తిగతంగా గడిపిన దృశ్యాలను వీడియోలు, ఫొటోలు తీసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.. న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని వాపోయింది.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తమకు న్యాయం జరగలేదంటోంది ఆ మహిళ..

Read Also: BRS Silver Jubilee Public Meeting: తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే..

మరో ముగ్గురు అమ్మాయిలను ఎమ్మెల్యే పీఏ వాయిద్‌ ట్రాప్‌ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే, అందరి ముందు తనను నిఖా చేసుకున్నాడని ఎన్టీవీకి తెలిపింది బాధితురాలు.. డిసెంబర్‌ 18వ తేదీన మాకు నిఖా జరిగింది.. ఇంట్లో వాళ్ల భార్యకు చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. అయితే, భార్యాభర్తలు కలిసినప్పడు కూడా వీడియోలు, ఫొటోలు తీసుకుని.. ఇప్పుడు నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు.. నా పర్సనల్‌ మొబైల్‌ దాచిపెట్టి.. బ్లాక్ మెయిల్‌ చేస్తున్నాడు.. భర్త అని మౌనంగా భరిస్తున్నా.. వేధింపులు తప్పడం లేదని వాపోయింది..

Exit mobile version