TDP Mahanadu: రేపటి నుంచి మహానాడు… పసుపు పండుగకు కడప ముస్తాబు..
- కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు..
- ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం..
- తొలి రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్..
- ఏపీలో ఏడాది పాలనపై 14 ముసాయిదా తీర్మానాలు..
- రెండో రోజు టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్ష ఎన్నిక..
- 450 మంది అతిథులు ఒకే వేదిక మీద కూర్చునేలా బాహుబలి వేదిక..
- మొదటి రోజు మహానాడులో 30 వేల మంది ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు..
- రెండో రోజు 2 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం..
- మూడవ రోజు 5 లక్షల మందితో బహిరంగ సభకు ప్లాన్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Mahanadu: తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు .. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు.. పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు. చంద్రబాబు ప్రసంగించిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు… ఏపీలో ఏడాది పాలనపై మహానాడు వేదికగా 14 ముసాయిదా తీర్మానాలకు రూపకల్పన చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన ఘన విజయాలు… సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం.. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు తీర్మానాలు ప్రవేశపెడ్తారు.
Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొత్త ఫోటోలు.. త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణ..
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
మహిళ, యువత సంక్షేమానికి పెద్ద పీట … సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం… మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా తీర్మానాలు ప్రవేశపెడ్తారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు.. ఒకే రాజధాని అమరావతి అభివృద్ధి కేంద్రీకరణ ఈ అంశాలు అన్నిటి మీద కూడా ప్రధానంగా తీర్మానాలు చేయనున్నారు. మహానాడులో ప్రధానంగా కూటమి ఏడాది పాలనకు సంబంధించి చర్చ జరుగనుంది. సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని అమరావతిపై మొదటి రోజు చర్చిస్తారు. శాంతి భద్రతలు, మహిళ యువత సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తారు. ఇక, రెండో రోజు మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. తర్వాత తెలంగాణకు సంబంధించి తీర్మానాలు ఉంటాయి. ఆ రోజు పి 4 పై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడ్తారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. లోకేష్‌కు కీలక పదవికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
Read Also: Tamannaah : తమన్నాను తీసుకోవడం కరెక్ట్ కాదు.. నటి రమ్య షాకింగ్ కామెంట్స్..
ఈ నెల 29న మూడో రోజు మహానాడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 450 మంది అతిథులు ఒకే వేదిక మీద కూర్చునేలా బాహుబలి వేదికను ఏర్పాటు చేశారు. మహానాడులో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే కడప గడపపై ప్రతి చోట పసుపు జెండా రెపరెపలాడుతోంది. ఎక్కడ చూసినా పసుపు మయమే. మొదటిరోజు 23 వేల మంది ప్రజాప్రతినిధులకు, అదనంగా మరో ఏడు వేల మందికి కలిపి మొత్తం 30 వేల మందికి ఆహ్వానాలు పంపించారు. రెండో రోజు సుమారు రెండు లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. మూడవరోజు ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ నుంచి ఎక్కువగా టీడీపీ శ్రేణులు తరలివస్తాయని అంచనా వేస్తున్నారు. మహానాడు సందర్భంగా సీఎం చంద్రబాబు మూడు రోజులు పాటు కడపలోనే బస చేస్తారు. ప్రత్యేక బస్సులో బస చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు..ఎమ్మెల్యేలు..మంత్రులు.. కడప చేరుకున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?