TDP vs YSRCP Clash: కడప జిల్లా పులివెందుల వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేసిన కేసులో 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేత వేముల రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు.. నిన్న పులివెందల మండలం నల్లగొండ వారి పల్లె ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యక్తరలు దాడికి పాల్పడ్డారు. కార్లతో గుద్ధి ఆపై కర్రలతో దాడి చేశారని పోలీసులకు వేముల రాము కంప్లైంట్ చేశాడు.
Read Also: Grok Spicy Mode: AIకి కూడా ‘స్పైసీ’ మూడ్.. అడల్ట్ కంటెంట్ మరింత ప్రమాదంగా మారనుందా?
ఇక, టీడీపీకి చెందిన 25 మందితో పాటు మరికొందరిపై నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు నమోదు చేశారు. పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డితో పాటు మరో 24 మందిపై కేసు ఫైల్ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు, వైసీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. పులివెందుల మండలం నల్లగొండ వారి పల్లెలో వేముల రాము, హేమాద్రి తనను కులం పేరుతో దూషించారని ధనుంజయ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
Read Also: Tollywood : సినీ కార్మికుల 4వ రోజు సమ్మె.. నేడు ఛాంబర్ లో కీలక భేటీ
మరోవైపు, ఎన్నికల నిమావళి ఉల్లంఘించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందల ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారని ఫిర్యాదులో ఎంపీడీవో పేర్కొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది.
