Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ- గ్రీన్ ఎనర్జిటిక్ స్టేట్ గా క్రియేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జిటిక్ అప్పుగా మారబోతుంది.. కరెంట్ ఛార్జీలు పెంచను అని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. నేను గెలిచిన తర్వాత ఒక్క పైసా పెంచకుండా ఉన్నాను.. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి.. పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి ఉద్యోగాలు రావాలి.. ఇక, విశాఖపట్నం ఒక స్టిల్స్ జిల్లాగా తయారవుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: CM Chandrababu: టీడీపీలో కోవర్టులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
అయితే, విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్బ్ గా తయారు అవుతుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంకు రైల్వే జోన్, ఫార్మాసిటీ వచ్చింది.. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి కీయా తేచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు. అలాగే, అభివృద్ధికి మారుపేరు టీడీపీ పార్టీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడం తెలుగుదేశం పార్టీకి లేదు.. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటుకు నేనే ఫౌండేషన్ వేశాను అని చంద్రబాబు వెల్లడించారు.
