NTV Telugu Site icon

YS Jagan: మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?

Ys Jagan

Ys Jagan

YS Jagan: చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం కుదేలు అయ్యో పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి 19.54 శాతం అప్పులు చేశారు.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 15.61 శాతం అప్పులు చేశామన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ను బాగా నడిపిన వైసీపీకి అవార్డు ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పు రత్న ఎవరికి ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. రెండేళ్లు కోవిడ్ ఉన్నా చంద్రబాబు కంటే మంచి పరిపాలన ఇచ్చాం.. జీడీపీలో రాష్ట్రం నుంచి టీడీపీ హయం కంటే వైసీపీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిందన్నారు. ఉద్యోగాల సృష్టిలో Phd చేసినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు.. రాష్ట్రంలో అంబానీలు, అదానీలు, ఆదిత్య మిట్టల్, బిర్లా లాంటి పారిశ్రామిక వేత్తలు వైసీపీ సమయంలో నే అనేక ఏంఓయూలు చేసుకున్నారు.. జిందాల్ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే ఇబ్బంది పెట్టు పంపిస్తున్నారు అని జగన్ ఆరోపించారు.

Read Also: New Study: ‘‘జ్ఞాపకాలు మెదడుకు మాత్రమే పరిమితం కావు’’.. శరీరంలో ఇతర భాగాల్లో మెమోరీ ఫంక్షన్స్..

అలాగే, రాష్ట్ర బడ్జెట్ ను చూస్తే మోసం అబద్ధం కనిపిస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి.. 170కి పైగా హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇస్తారు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలపై 420 కేసు ఎందుకు పెట్టకూడదన్నారు. మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..? అని అడిగారు. చంద్రబాబు మోసాలపై నేను ట్వీట్ చేస్తాను.. మీరంతా ట్వీట్ చేయండి అని పిలుపునిచ్చారు. చంద్రబాబు మోసాలపై నాతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తలు ట్వీట్ చేస్తారన్నారు. ఎంతమందిపై కేసులుపెడతారో పెట్టండి.. అసెంబ్లీ జరిగినంత కాలం మా ఎమ్మె్ల్యేలు మీడియా ముందు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

Show comments