NTV Telugu Site icon

CPI Ramakrishna: ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ ప్రతిపక్షంలో ప్రజల తరపున పోరాడాలి..

Ramakrishna

Ramakrishna

CPI Ramakrishna: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు అని ఆరోపించారు. రెవెన్యూ దొంగలను కఠినంగా శిక్షించాలి.. పేదల భూములను బలవంతంగా కబ్జా చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల తరపున పోరాడాలి అని సూచించారు. అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షం చేసే తప్పులను ఎండగట్టాలి అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడాన్ని తప్పుపడుతున్నామని సీపీఐ రామకృష్ణ అన్నారు.

Read Also: Ambati Rambabu: ఏపీకి ఇచ్చిన రూ. 15 వేల కోట్లు గ్రాంట్ కాదు అప్పు..?

ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. రాష్ట్రంలో కృష్ణ, తుంగభద్ర, గోదావరి నదులకు వరదలు వస్తున్నాయి.. కానీ రాయలసీమలో వర్షాలు కురవక కరువు తాండవిస్తోంది అని చెప్పుకొచ్చారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేయాలి అని సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు కరువు జిల్లాలో పర్యటించాల్సిన అవసరం ఉంది అని సీపీఐ రామకృష్ణ తెలిపారు.

Show comments