Site icon NTV Telugu

YS Jagan Mohan Reddy: మెడికల్ కాలేజీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు అమ్ముకుంటున్నారు..

Jagan 3

Jagan 3

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి అని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని కూడా కట్టలేదు అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం.. ఒక్కో మెడికల్‌ కాలేజీ రూ.500 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశాం.. కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Read Also: Kakani Govardhan Reddy: జగన్ను తిడితే పదవిలు వస్తాయని పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారు..!

ఇక, పులివెందుల మెడికల్‌ కాలేజీకి NMC 50 సీట్లు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దని వెనక్కి పంపారు అని వైసీపీ చీఫ్ జగన్ పేర్కొన్నారు. ఇంతకీ చంద్రబాబు మనీషా రాక్షసుడా మీరే ఆలోచించాలని తెలిపారు. మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తే, రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుంది అన్నారు. మా ప్రణాళిక అమలు జరిగి ఉంటే, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల కాలేజీలు గతేడాదే అందుబాటులోకి వచ్చేవి.. ఈ ఏడాది మరో 6 మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చే వాళ్లమని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులు లేకుండా ప్రైవేట్ దోపిడీని ఆపేది ఎవరు అని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఆస్పత్రులను నడపడం అంటే ఒక బాధ్యత.. ఇక, మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే, నాకు క్రెడిట్ వస్తుందని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని వైఎస్ జగన్ క్వశ్చన్ చేశారు.

Read Also: Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్‌మీట్‌లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్

ఇక, ఆంధ్ర రాష్ట్రంలో మేము అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రూ. 3 వేల కోట్ల పనులు జరిగాయని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మిగిలిన రూ. 5 వేల కోట్లకు నాబార్డ్ అనుమతులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి అంగీకరించింది అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చ చేయలేరా అని అడిగారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Exit mobile version