త్వరలో నామినేటెడ్ పదవుల ప్రకటన.. ఈసారి టీటీడీ ఛైర్మన్ పదవి వారికే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటన పై ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వం విధానంగా పెట్టుకున్న సామాజిక వర్గాల కూర్పు లెక్కలు కొలిక్కి వచ్చాయి. అయితే రేపు వైఎస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉండటంతో ఎప్పుడు ప్రకటించాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
read also : ఇండియా కరోనా అప్డేట్.. 24 గంటల్లో 43,733
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
వైసీపీ ప్రభుత్వం సుమారు 80 వరకు కార్పొరేషన్లను త్వరలో ప్రకటించనుంది. పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ జరుగనుంది. గత కొద్ది రోజులుగా నియామకాల పై కసరత్తు జరుగుతోంది. రీజనల్ ఇంఛార్జుల పలు మార్లు కూర్చుని ఉమ్మడిగా కూడా నేతల ఎంపిక పై చర్చించారు. తమ పరిధి మేరకు సిద్ధం చేసిన పేర్ల జాబితాను ముఖ్యమంత్రి జగన్ ముందు పెట్టారు. వాటి పై సీఎం కొన్ని సవరణలు, సూచనలు చేశారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో 50 శాతం స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని జగన్ సర్కార్ విధానంగా పెట్టుకుంది. సమీకరణాల్లో సరిపోయే విధంగా నేతల ఎంపిక, జిల్లాల వారీగా ప్రాతినిధ్యం కసరత్తు కూడా పూర్తి అయిందని తెలుస్తోంది.
మరోవైపు టీటీడీ, శ్రీశైలం దేవాలయాల పాలకమండళ్ళ నియామకం కూడా పూర్తి అయినట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే రెండో దఫా కొనసాగిస్తారని సమాచారం. అయితే భారీ ఎత్తున నామినేటెడ్ పదవులు ఇస్తుండడంతో ప్రకటన ఎప్పుడు చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రేపు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇది జరిగాక పదవుల ప్రకటన ఉంటుందని కొందరు నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Aamir Khan: లాలా అమర్నాథ్ బయోపిక్.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !
-
Prabhas-Spirit: ప్రభాస్ పవర్ఫుల్ రిహార్సల్స్.. మొత్తం పోతారు పో!
-
Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్నెస్ ట్రాకర్ ..
-
Peddi Trailer Release Date: ‘పెద్ది’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఈవెంట్ మాత్రం ఇక్కడ కాదండోయ్!
-
Gulab Jamun Paratha Recipe: ఎప్పుడైనా ‘గులాబ్ జామ్ పరాఠా’ రుచి చూశారా..? పిల్లలు ఇష్టంగా తినే స్పెషల్ రెసిపీ..