YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన.. ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు
- నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళన..
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు..
- నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు..
- నకిలీ మద్యంపై చనిపోయిన వారి కటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది: రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. నకిలీ మద్యంతో చనిపోయిన వారికి అండగా వైసీపీ పోరాటం చేస్తుంది.. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో 20 వేల లీటర్ల నకిలీ మద్యం దొరికింది.. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యం తయారీ చేయగలరా అని ప్రశ్నించింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని సూచించింది. మాపై నకిలీ మద్యం లిక్కర్ కేసులు పెట్టారు.. ఇప్పుడు నిజంగానే వారు దొరికారు అని ఎద్దేవా చేసింది. జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్టు అయితే చంద్రబాబు ఎలా ఎమ్మెల్యే సీటు ఇచ్చాడు అని క్వశ్చన్ చేసింది. చంద్రబాబు అనుభవం అంతా అవినీతి డబ్బు కోసమే.. చంద్రబాబు సిగ్గు లేకుండా సిట్ వేస్తానని చెబుతున్నాడు.. సిట్ వల్ల ఉపయోగం లేదు.. సీబీఐ విచారణ కావాలని ఆర్కే రోజా డిమాండ్ చేసింది. అయితే, పవన్ కు లిక్కర్ స్కాంలో ముడుపులు అందాయని ఆరోపించింది. ప్రశ్నించాల్సిన పవన్ సైలెంట్ గా ఉన్నాడంటే అతడికి పెద్ద ఫ్యాకేజ్ అందిందని పేర్కొన్నారు. కిలారి రాజేష్ ద్వారా లోకేష్ కు మద్యం ముడుపులు అందాయి.. కల్తీ మద్యం అమ్మకాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.
Read Also: Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!
Also Read
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
మరోవైపు, కల్తీ మద్యంపై వైసీపీ నిరసన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీ ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు అని పెట్టుకో అని సూచించారు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు.. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు నువ్వు కట్టిన తాళ్ళను పరా పరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు అన్నారు. నీ గన్ మెన్ లు ఉన్న నిన్ను టీడీపీ కార్యకర్తలు కొట్టకపోతే నన్ను అడుగు అన్నారు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు, అల్లాడి ఏడుస్తున్నారు.. మన ఇంట్లో వాళ్ళు భాష, శివ రామ కృష్ణ, సమాధులు దొడ్డి దగ్గర ఉన్న బాబాయ్ ఈ కుమ్ముడికి జెండా మోసిన కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారని పేర్నినాని తెలిపారు.
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!