IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Sri Lanka Asian Games 2026 Weather Report: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ పోటీలకు వరుణుడి అడ్డంకులు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ వర్షం కారణంగా ప్రభావితమవుతోంది. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో.. టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మిగిలిన మూడు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
ఇక సెమీఫైనల్లో భారత్, శ్రీలంక గురువారం (అక్టోబర్ 1) తలపడనున్నాయి. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ మ్యాచ్‌కు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉండగా.. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండనుంది. వర్షం కురిసే అవకాశం కేవలం ఒక శాతమే. దీంతో సెమీఫైనల్ మ్యాచ్ పూర్తి స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
అయితే వర్షం కారణంగా భారత్, శ్రీలంక సెమీఫైనల్ కూడా రద్దైతే.. నిబంధనల ప్రకారం టీమిండియా ఫైనల్‌కు చేరుతుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు శ్రీలంక కంటే మెరుగైన ర్యాంకు ఉండటమే ఇందుకు కారణం. గత ఆసియా క్రీడల్లో శ్రీలంక క్వార్టర్‌ఫైనల్ దశలోనే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్‌తో సెమీఫైనల్లో తలపడుతోంది. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. బంగ్లాదేశ్, మలేషియా మధ్య జరిగిన క్వార్టర్‌ఫైనల్ కూడా వర్షం కారణంగా రద్దైంది. దీంతో రెండు సెమీఫైనల్స్ అక్టోబర్ 1న జరగనున్నాయి. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్-పాకిస్థాన్ తలపడగా.. అనంతరం భారత్-శ్రీలంక పోరు జరగనుంది.
పురుషుల క్రికెట్లో 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మెరుగైన ర్యాంకు ఆధారంగా భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. ఇప్పుడు మరోసారి స్వర్ణాన్ని నిలబెట్టుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల విభాగంలోనూ భారత జట్టు ఇప్పటికే స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!