టాలీవుడ్ హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతుంటే టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలు అయిన వాళ్లు.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో, బాధల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమన్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కరు కూడా వరద ప్రజల గురించి ఒక్క స్టేట్‌మెంట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఆరోపించారు.
Read Also: ట్రెండింగ్‌లో త్రివిక్రమ్ ట్వీట్.. ట్విస్ట్ ఏంటంటే..?
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
గతంలో ప్రజలకు ఎప్పుడైనా అనుకోని విధంగా కష్టాలు వస్తే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వెంటనే స్పందించి రోడ్డు మీదకు వచ్చి జోలె పట్టి సహాయం చేసేవారని నల్లపురెడ్డి గుర్తుచేశారు. అందుకే ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు సినిమాల్లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని.. వారిని హీరోలను చేసిన ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా హీరోలు స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదో ఒక సాయం చేయాలని నల్లపురెడ్డి పిలుపునిచ్చారు. హీరోలు సంపాదించిన దాంట్లో కొంచెమైనా ప్రజలకు సాయం చేయాలని ఆయన హితవు పలికారు. మరోవైపు నిర్మాతలు, దర్శకులు కూడా స్పందించాలని తాము కోరుతున్నామని నల్లపురెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..