ట్రెండింగ్‌లో త్రివిక్రమ్ ట్వీట్.. ట్విస్ట్ ఏంటంటే..?

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు ఏపీ రాజకీయాలలో మోత మోగిపోతుంది. ఇదేంటి త్రివిక్రమ్ రాజకీయాలలో ఎప్పుడు చేరాడు.. ఎవరిని ఏమి అన్నాడు అని కంగారు పడకండి. ఆయన ఏమి అనలేదు.. ఒక చిన్న పొరపాటు ఆయనను కూడా ఈ రాజకీయాలలోకి లాగింది. ఇంతకీ విషయం ఏంటంటే.. శుక్రవారం మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల రేట్ల విషయంపై మాట్లాడుతూ త్రివిక్రమ్ చేసిన ట్వీట్ గురించి కూడా జగన్ తో మాట్లాడతానని తెలిపారు. త్రివిక్రమ్ చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్‌ రేటు అన్నట్లుగానే ప్రతి స్కూల్‌లోనూ ఒకటే ఫీజు, ప్రతి ఆసుపత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు? పేదవాడికి విద్యా, వైద్యం కంటే సినిమా ఎక్కువా?” అంటూ త్రివిక్రమ్ ట్వీట్ చేసినట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అంతేకాకుండా అయన మాట్లాడిన అంశం గురించి కూడా జగన్ కి చేరవేస్తానని, తన పని అదేనని చెప్పుకొచ్చారు.

అయితే నిజంగా చెప్పాలంటే అసలు త్రివిక్రమ్ కి ట్విట్టర్ అకౌంటే లేదు. అది ఒక ఫేక్ అకౌంట్.. అయితే తాజాగా ఈ ట్వీట్ గురించి ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ స్పందించింది. త్రివిక్రమ్ కి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని, ఆయన సంబంధించిన ఏవైనా అధికారిక ప్రకటనలు తమ నిర్మాణ సంస్థ లేదా తన నుంచే వస్తాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ” త్రివిక్రమ్ కి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు.. ఆయన పేరు, ఫోటో పెట్టి ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చే వార్తలను నమ్మకండి” అంటూ తెలిపారు.

Related Articles

Latest Articles