NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

What’s Today:
* నెల్లూరు: నేడు టీవీఎస్ కళ్యాణ్ సదన్‌లో గోదాదేవి కళ్యాణం.. పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
* నేడు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో భారీ సెట్టింగ్స్‌తో సంక్రాంతి సంబరాలు.. తెలుగు వారి సాంస్కృతి, సంప్రదాయలను చాటి చెప్పుతూ, అంతరించిపోతున్న కళలను గుర్తుచేస్తూ ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న సంబరాలు
* ప.గో.: నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 59వ వార్షికోత్సవం మహోత్సవాలు
* చిత్తూరు: నేడు నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాండురంగయ్యగారి పల్లెలో ట్రెక్కింగ్.. మధ్యాహ్నం 5 వేల మంది ప్రజలకు భోజన ఏర్పాట్లు.. సాయంత్రం గ్రామస్తులతో కలిసి విందులో పాల్గొననున్న చంద్రబాబు.. హైదరాబాద్‌కు చెందిన మిమిక్రీ కళాకారులతో ఇంట్లోనే ప్రత్యేక కార్యక్రమం
* హైదరాబాద్: ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. లింగంపల్లి-నాంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో ట్రాక్ మరమ్మతుల కారణంగా 19 సర్వీసులు రద్దు
* ఉప్పల్‌లో ఈనెల 18న జరిగే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు నేటి నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు

Show comments