*ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
* నేటి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం… కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర..
*నేడు కాకినాడలోని వలసపాకల కేంద్రీయ విద్యాలయానికి రానున్న మైక్రో బయాలజీ నిపుణులు..పిల్లలు అస్వస్థత పై విచారణ చేయనున్న నిపుణులు
*నెల్లూరు జెడ్పీ హాలులో జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం
*నేడు మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సీపీఎస్ సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ
* నేడు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
*విశాఖలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ(ఐఐపీఈ)రెండవ స్నాతకోత్సవం
*విశాఖలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజుల పర్యటన…నేడు ఋషికొండ ఏ1 కన్వెన్షన్ లో ఆత్మీయ సమావేశం.
* కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి రథోత్సవం…రథోత్సవానికి భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
* నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన…పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి