Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today 1280

Whats Today 1280

* నేడు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపననన్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం.. SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.. సీఆర్డీఏ ప్రతిపాదనల్లో కీలక అంశంగా ఆర్ 5 జోన్..

* నేడు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ.. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ.. కూటమి నుంచి 10 మంది ఎమ్మెల్యేలను మాట్లాడించాలని నిర్ణయం.. మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం చంద్రబాబు ప్రకటన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించే అవకాశం..

* నేటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు.. అసెంబ్లీ ముగిసిన తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆటల పోటీలు..

* నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన.. సాయంత్రం 4 గంటలకు పులివెందుల భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్.. రేపు ఉదయం 9: 30 గంటలకు నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొననున్న జగన్.. రేపు మధ్యాహ్నం భాకరాపురం క్యాంపు ఆఫీసులో వైఎస్ జగన్ ప్రజాదర్బర్..

* నేడు జోగి రమేశ్ బెయిల్ పిటిషన్ పై ఎక్సైజ్ కోర్టులో విచారణ.. జోగి రమేశ్ బెయిల్ రద్దు పిటిషన్ వేసిన ఎక్సైజ్ పోలీసులు.. రిజిస్టర్ పోస్టు ద్వారా జోగి రమేశ్ కు నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ కోర్టు.. నకిలీ మద్యం కేసులో బెయిల్ మీద బయట ఉన్న జోగి రమేశ్

* నేడు ఆదిలాబాద్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీ కాంత్ లతో ములాఖాత్ కానున్న కేటీఆర్.. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ వాహనంపై రాళ్ళ దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్..

* నేడు వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నగరంలోనీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలన.. పరిశీలన అనంతరం హరీష్ రావు ప్రెస్ మీట్..

* నేడు నిజామాబాద్ మార్కెట్ యార్డు బంద్.. పసుపు క్రయ, విక్రయాలు రద్దు చేసిన అధికారులు.. మార్కెట్ కు పోటెత్తిన పసుపు.. కుప్పలు వేయడానికి స్థలం లేక బీట్లు రద్దు.. వాతావరణ మార్పు రాత్రి కురిసిన అకాల వర్షంతో ఆందోళనలో పసుపు రైతులు..

* నేడు మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ.. మధ్యాహ్నం 3 గంటలకీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ.. దేవ్ జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి, నూనె గంగన్నలు కూడా లొంగుబాటు.. ముగ్గురు అగ్ర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు సైతం లొంగుబాటు..

* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం..

* నేడు దివంగత నేత మాజీ సీఎం జయలలిత జయంతి.. జయలలిత పుట్టిన రోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రకటించడానికి సిద్దమైతున్న శశికళ.. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం పని చేయడం లేదని, అందుకే ఎన్నికల బరిలో దిగి మన ఉనికిని చాటాలని శశికళపై మద్ధతుదారుల ఒత్తిడి.. గత కొద్దిరోజులగా కొత్త పార్టీని స్థాపించడమా లేక తన సోదరుడు 2018లో రిజిస్టర్ చేసిన ‘అన్నా ద్రావిడర్ కళగం’ (ఏడీకే) తరఫున అభ్యర్థులను నిలబెట్టడమా?, ఇండిపెండెంట్ గా అభ్యర్థులను నిలబెట్టడమా అన్న ప్రశ్నలకు ఈరోజు రానున్న క్లారిటీ..

* నేడు కేంద్ర క్యాబినేట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.

* ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్ట్ లోకి మారాక తొలి క్యాబినేట్ మీటింగ్

* నేడు వరల్డ్ కప్ సూపర్-8లో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్.. రాత్రి 7 గంటలకు పల్లెకెల అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్

Exit mobile version