* నేడు కరీంనగర్ కు రానున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకూ భారీ ర్యాలీ
* నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్. లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పంచకుండాత్మక మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు.
* ఈ నెల 27 న సీఎంలతో ప్రధాని సమావేశం.ఈ నెల 27 న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం.
* నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటన.
* నేడు కర్నూలు కలెక్టరేట్ ముందు వి హెచ్ పి, భజరంగధల్, ధార్మిక సంఘాల నిరసన. హిందూ ఆలయాలు, శోభా యాత్రలపై దాడులకు నిరసనగా ఆందోళన
*నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ,వెండి రథోత్సవం
* విశాఖలో నేడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ రాక. విజయనగరం పర్యటన కోసం వస్తున్న కేంద్ర మంత్రి
* అమరావతిలో సీఎంఓ ముట్టడికి యూటీఎఫ్ పిలుపు. భారీగా మోహరించిన పోలీసులు. కొందరు నాయకుల హౌస్ అరెస్ట్.
