1. ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమకానుంది.
2. ఏపీలో ఆగస్టులో వర్షాలు పడాల్సింది పోయి ఎండలు మండిపోతున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే సెప్టెంబర్‌లో మాత్రం వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. వచ్చే నెల మొదటి వారం నుంచి విస్తారంగా వానలు పడతాయని చెబుతున్నారు.
3. నేడు జగన్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనున్న సీబీఐ కోర్టు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు విదేశాలకు వెళ్లేందుకు జగన్, విజయసాయి పిటిషన్‌లు.
4. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
5. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నేడు చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి వేడుకలు. హాజరుకానున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, బిఆర్ఎస్ నాయకులు, ఇప్పటికే కోనరావుపేట మండలం మల్కపేట 9వ ప్యాకేజీ రిజర్వాయర్ కు రాజేశ్వరరావు పేరును ఖరారు చేసిన సీఎం కేసీఆర్.
6. మంత్రి హరీశ్ రావు ఉదయం 10.30 గంటలకు నిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభిస్తారు. అనంతరం 11.00 గంటలకు వెంగల్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్మన్ గా డా.మధు శేఖర్ గారి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
7. నేడు ముంబైలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటన. ముంబైలో మమతా బెనర్జీకి అమితాబ్ బచ్చన్ ఆతిథ్యం. నేడు ఇండియాకూటమి సమావేశానికి హాజరుకానున్న మమత
8. నేడు శ్రీహరికోటకు రానున్న ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్. PSI V C-57 రాకెట్ ప్రయోగంపై నేడు మిషన్ రెడీనిస్ రివ్యూ సమావేశం. రాకెట్‌లోని వివిధ విభాగాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు. ఆదిత్య-L1 ప్రయోగానికి రేపు ఉ.11:50 గంటలకు కౌంట్ డౌన్. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య-L1 ఉపగ్రహం ప్రయోగం. శనివారం ఉదయం ఆదిత్య-L1 రాకెట్ ప్రయోగం.
