నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్.
తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శన టిక్కెట్లు విడుదల. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.
తిరుమల: 21 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,853 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 22,551 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.47 కోట్లు.
పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర అంతర్గత తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో తీవ్రఅల్పపీడనం. ఇవాళ అల్పపీడనంగా బలహీనపడే అవకాశం. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు. కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు.
అమరావతి : ఇవాళ చలో విజయవాడ మహాధర్నా యధాతథం అంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్. ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ (ఆషా) మహాధర్నా. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా. 2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఆషా.. ప్రభుత్వం విడుదల చేసిన 250 కోట్లతో సరిపెట్టుకోలేం అంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.. పూర్తి బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగుతుందంటున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. గత 14 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పటల్స్ బకాయిల విడుదల కోసం ఆందోళన.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, రిజర్వేషన్ల పై న్యాయ నిపుణుల నివేదిక పై చర్చించనున్న మంత్రి వర్గం.
నేడు నిజమాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటన. విధి నిర్వహణ లో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించనున్న పీసీసీ అధ్యక్షుడు.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ. బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్న కేబినెట్. కాళేశ్వరం ప్రాజెక్ట్, SLBC పునరుద్ధరణ, SRSP రెండో దశ పనులపైనా చర్చించనున్న కేబినెట్. రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే. ఉదయం 9 గంటలకు ఆడిలైడ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు భారత్‌తో తలపడనున్న న్యూజిలాండ్. మధ్యాహ్నం 3 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ ప్రారంభం.
తెలంగాణలో మద్యం టెండర్లకు నేటితో ముగియనున్న గడువు. 2,620 మద్యం షాపులకు ఇప్పటివరకు 90 వేల దరఖాస్తులు. సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం. ఈ నెల 27న లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు.
