Site icon NTV Telugu

Minister Satya Prasad: పవన్ ఏం అయ్యారో.. ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు..

Anagani

Anagani

Minister Satya Prasad: పులివెందుల ప్రజలు రౌడీయిజం మాకు వద్దని కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం చేయడం కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు. బైక్ అద్దెకు తీసుకుని డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు పవన్ అనే యువకుడిని దారుణంగా కొట్టారు.. గతంలో కూడా డాక్టర్ సుధాకర్, దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారు అని ఆరోపించారు. దాడి చేసినా వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో దాకున్నారు.. భూమన ఇంట్లో ఉంటే వారిని పోలీసులు అరెస్టు చేశారు‌‌‌ అని మంత్రి అనగాని పేర్కొన్నారు.

Read Also: Top Selling Cars: భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడబోతున్న కార్లు ఇవే!

అయితే, దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూమన అనుచరులు ప్రజలపై దాడులు చేస్తున్నారు.. ఒక దళిత యువకుడ్ని బంధించి కొట్టారు‌‌‌.. పవన్ ఏం అయ్యాడో.. ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ‌ఏర్పడింది.. పవన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version