Elamanchili: పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరిన ఛైర్ పర్సన్ పై వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానం నోటీసుపై 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. దీంతో రేపటిలోగా కొత్త ఛైర్ పర్సన్ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించే ఛాన్స్ ఉంది.
Read Also: Kushboo : నటించేంత టాలెంట్, అందం నా దగ్గర లేదు.. ఖుష్బూ కూతురు
అయితే, మరోవైపు, యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీటీసీలు కార్యాలయంలోకి వెళ్లిన అనంతరం వైసీపీ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఎన్నికల అధికారుల దగ్గర ఎన్డీయే కూటమికి చెందిన ఎంపీటీసీలు ఫిర్యాదులు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికను అధికారులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.