Site icon NTV Telugu

Usha Vance: ఉషా వాన్స్ పూర్వీకుల సొంతూరు ఇదే.. ఇప్పుడెలా ఉందంటే..!

Ushavance

Ushavance

అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు. ఉషా తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. కాలేజీ చదివే రోజుల్లో జేడీ వాన్స్-ఉషా చిలుకూరి మధ్య ప్రేమ చిగురించి అనంతరం వివాహం చేసుకున్నారు. ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఎన్నికయ్యారు.

నాలుగు రోజుల పర్యటన కోసం జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు, పిల్లలు భారత్‌కు చేరుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక సోమవారం ప్రధాని మోడీ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. ఇక ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో ఉషా పూర్వీకుల గ్రామంలో స్థానికులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

 

ఉషా చిలుకూరి పర్యటనపై వడ్లూరు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉషా సొంతూరుకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల క్రితం గ్రామాభివృద్ధి కోసం ఆ కుటుంబం పాటు పడిందని గుర్తుచేశారు. ఆమె రాక కోసం తామంతా ఎదురు చూస్తున్నట్లు గ్రామస్తులు చెప్పుకొచ్చారు.

 

Exit mobile version