Illegal Affair: సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పరిధిలోని నిమ్మనపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉండి రైల్వే స్టేషన్ దగ్గర నిన్న అనుమానస్పద స్థితిలో మృతి చెందిన దొంగ సుబ్బారావు కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అందిన సమాచారం మేరకు విషయం వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న కడలి విజయలక్ష్మీని మూడు రోజుల క్రితం హతమార్చి సుబ్బారావు ఉండి రైల్వే స్టేషన్ కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Rashmi Gautam : అడ్డుగా ఉన్నాయని కుక్కలను చంపేస్తారా.. రేపు అమ్మానాన్నలను కూడా అంతేనా?
అయితే, అద్దెకు ఉంటున్న ఇంట్లో కడలి విజయలక్ష్మీ మృతదేహం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం సహాయంతో ఇంట్లో ఉన్న మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సుబ్బారావు హత్య చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.