Site icon NTV Telugu

Karumuri Nageswara Rao: ఈవీఎంల ట్యాంపరింగ్‌తో అధికారంలోకి వచ్చారు.. ఇప్పుడు భయం పట్టుకుంది..!

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేయలేదని కూటమి నాయకులు చెబుతున్నారని.. కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే కూటమి నాయకులకు పేర్లు ఇచ్చారని ఆరోపించారు..

Read Also: Coolie : రజనీ-లోకేష్ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ ‘కూలీ’ కాదట

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇటువంటి మెజార్టీలు ఎక్కడా చూడలేదు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచింది. తణుకు నియోజకవర్గంలో ఆరమిల్లి రాధాకృష్ణకు 72 వేల ఓట్లు ఈవీఎం ట్యాపరింగే అని ఆరోపించారు.. ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎం ట్యాపరింగ్‌ జరిగిందని చెప్పిన మొదటి వ్యక్తి నేనే. ప్రజా సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చేయలేదని ప్రజలు ఓట్లు వేయలేదని నాయకులు చెబుతున్నారు . కేవలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మాత్రమే గెలిచారు. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

Exit mobile version