లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ వంటి కథానేపద్యంలో రాబోతున్న కూలీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
Also Read : Tollywood : కనుమరుగు అయిందనుకున్న భామకు క్రేజి ఆఫర్స్
కాగా సూపర్ స్టార్ రజినికాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్నఈ సినిమాకు మొదటి అనుకున్న టైటిల్ కూలీ కాదట. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ వెల్లడించారు. చెన్నైలో జరిగిన కూలీ ఈవెంట్ లో రజిని మాట్లాడుతూ ‘ లోకేష్ కనగరాజ్ మొదట నాకు వేరే కథ చెప్పాడు. అందులో నాది ప్యూర్ విలన్ రోల్. నేను ఎంతో సంతోషించాను. చంద్రముఖి తర్వాత విలన్ రోల్ అవకాశం దొరికిందని హ్యాపీ ఫీల్ అయ్యను. కానీ నెల రోజుల తర్వాత వచ్చి ఆ కథకు బదులుగా ఈ కూలీ కథ చెప్పాడు. అలాగే మొదట ఈ సినిమాకు దేవ అని టైటిల్ అనుకున్నాము. అలాగే ఈ సినిమాలో మరొక ఇంపార్టెంట్ రోల్ ఉందని దానికి నేను ఫహద్ ఫాజిల్ పేరు రిఫర్ చేశాను కానీ అనుకోని కారణాల వలన మరొక మలయాళ నటుడు సౌబిన్ ను తీసుకున్నాం. కానీ సౌబిన్ చేసిన ఆ రోల్ సినిమాలో చాలా కీలకమైనది’ అని అన్నారు.