NTV Telugu Site icon

Hari Ramajogaiah: ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి అంటూ హరి రామజోగయ్య లేఖ..

Harirama Jogaiah

Harirama Jogaiah

తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి విజ్ఞప్తి అంటూ కాపు బలిజ సంక్షేమ సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉన్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అలాగే కొన్ని సవరణలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు ప్రతిపాదించిన పెన్షన్ల వయోపరిమితి 50 సంవత్సరాలు అర్హులైన అన్ని కులాలకు వర్తింపజేయాలని కోరారు. బీసీలకు మాత్రమే ప్రతిపాదించిన రూ. 4 వేల పెన్షన్ అర్హులైన అన్ని కులాలకు వర్తింప చేయాలన్నారు.

Vellampalli Srinivas: ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదు.. జనసేనానిపై విమర్శలు

జనాభా ప్రాతిపదికన సంక్షేమ బడ్జెట్ అన్ని కులాలకు కేటాయించాలని హరి రామజోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కులస్తులకు జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. పెరిగిన నిత్యవసర ధరల దృష్ట్యా.. ప్రతి తెల్ల కార్డు కుటుంబానికి నెలకు రూ. 1000 చేదోడుగా అందించాలన్నారు. బీసీలకు ఒక న్యాయం.. ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాలకు మరొక న్యాయం కాకుండా మ్యానిఫెస్టోలో చేర్చాలని లేఖలో ప్రస్తావించారు.

Roshan : ‘ఛాంపియన్’ గా రాబోతున్న శ్రీకాంత్ తనయుడు..

ఇదిలా ఉంటే.. ఈరోజు కూడా తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై స్పందించారు. వైసీపీ, తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలపై హరి రామజోగయ్య లేఖ రాశారు. తమ పార్టీల మేనిఫెస్టో ప్రకటనలో కాపు రిజర్వేషన్ అంశం లేకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా.. మరోసారి స్పందించారు.