టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు “రోషన్” హీరోగా బాగానే రానిస్తున్నాడు . తన మొదటి సినిమా అయిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు..అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో రోషన్ హీరోగా నటించాడు .రోషన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ ఎంతో బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు .అలాగే నటన పరంగా ,డాన్స్ పరంగా ఎంతగానో ఆకట్టుకున్నారు..అయితే ఈ సినిమా కమర్షియల్గా అంతగా ఆకట్టుకోకపోయిన హీరో రోషన్ కు హీరోయిన్ శ్రీలీలకు మంచి పేరు వచ్చింది.అయితే ఈ సినిమా తరువాత హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది .కానీ రోషన్ మాత్రం మరో సినిమాలో నటించలేదు.
తాజాగా ఈ యంగ్ హీరో ఇప్పుడు వైజయంతీ మూవీస్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నారు.రోషన్ హీరోగా వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమాస్ సంస్థలు కలిసి ‘ఛాంపియన్’ అనే సినిమా రూపొందిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ ‘అద్వైతం’తో నేషనల్ అవార్డు అందుకున్న ఈ దర్శకుడు ‘ఛాంపియన్’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ‘ఛాంపియన్’ మూవీ రూపొందుతోంది. జూలై నుంచి సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు అవనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే రోషన్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఛాంపియన్’ సినిమాలో హీరో లుక్ ను విడుదల చేస్తూ రోషన్ కు చిత్ర యూనిట్ బర్త్డే విషెస్ తెలిపింది. ఈ లుక్ లో రోషన్ లాంగ్ హెయిర్, గడ్డంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు. ప్రస్తుతం రోషన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .