NTV Telugu Site icon

Srinivasa Rao: ప్రభుత్వం మారి 6 నెలలు గడిచినా.. విధానాలు మాత్రం మారలేదు..!

Cpm Srinivasa Rao

Cpm Srinivasa Rao

Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచినా విధానాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్ ప్రభుత్వం ప్రధానితో కుదుర్చుకున్న ఒప్పందాలనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందన్నారు. దానిలో భాగంగానే గతంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన నారా లోకేష్.. నేడు వాటిని బిగించాలని చెప్పటం సిగ్గుచేటని శ్రీనివాస రావు మండిపడ్డారు. ప్రజలపై దొడ్డి దారిన 1600 కోట్లు భారం మోపటం దారుణమని, దీనిపై జనవరి 7, 10 తేదీల్లో విజయవాడ కర్నూలులో ధర్నాలు చేసి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగిమంటల్లో దగ్ధం చేస్తామన్నారు. ఇక, ఫిబ్రవరి 1 ,2, 3, 4, తేదీలలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. (సీపీఎం) రాష్ట్ర మహాసభలను నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. గత రెండు రోజులుగా నర్సాపూర్ లో నిర్వహిస్తున్న సీపీఎం మహాసభల్లో తీర్మానాలు చేశామన్నారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు.

Read Also: IND Women vs WI Women: దీప్తి శర్మ ఆల్‌రౌండర్ షో.. వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా