Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్‌.. మూడు నెలల్లో రెండో సారి..

Aqua Farmers

Aqua Farmers

Aqua Farmers: ఆక్వా రైతులకు మరోసారి ఫీడ్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి.. మూడు నెలల్లో రెండో సారి మేత ధరలు పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనామీ రకం మేత పై కిలోపై పది రూపాయలు పెంచగా.. టైగర్ ప్రాన్ మేత ధరలు కిలోపై 12 రూపాయల ధర పెరిగింది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రావడంతో పాలకొల్లులో ఆక్వా రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ పై సమాలోచన చేస్తున్నారని. ఇప్పటికే రొయ్య రేటు పతనం కావడం, పెంచిన ధరలతో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రైతులతో చర్చించకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై మరోసారి నిరసనలు తెలిపేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఫీడ్‌ ధరలు పెరగడంతో 25 కేజీల వనామి రొయ్యల మేత బస్తా ధర 2,793, టైగర్ రొయ్య మేత బస్తా ధర 3,088 కు చేరింది.. ఇప్పటికే అమెరికా టారిఫ్‌ ఎఫెక్ట్‌తో నష్టపోయిన రైతులు.. మరోవైపు, ఇరాన్ – ఇజ్రాయల్, అమెరికా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం కూడా ఆక్వా ఎగుమతులపై పడడంతో ఇబ్బంది పడుతున్నారు రైతులు.. అయితే, వరుసగా మేత ధరలు పెరగడం మరింత భారంగా మారిపోతుంది..