ఏపీలో వీకెండ్ లాక్ డౌన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఇప్పుడు మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా వైరస్ కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్ తరువాత డెల్టా వేరియంట్ తో కరోనా ప్రజలను సెకండ్ వేవ్ రూపంలో భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా డెల్టా వేరియంట్ ఫస్ట్ వేవ్ కంటే 3 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలను సైతం తాన్ ముందు మోకరిల్లేలా చేసింది. అయితే ఇటీవల సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతుండడంతో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి కూడా ప్రవేశించి పలు రాష్ట్రాల్లో సైతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.
ఒమిక్రాన్ ప్రభావంతో ఏపీలో కూడా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజు 10వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు విధించడంతో కరోనా కేసులు తగ్గడం మొదలుపెట్టాయి. అయితే ఇప్పటికే ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ కరోనా కేసులు అధికంగా నమోదవుతుండడంతో.. ఇక వీకెండ్ లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించలేదు. కరోనా కేసులు తగ్గకపోతే ఏపీలో వీకెండ్ లాక్ డౌన్ అనివార్యమే..!
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!