YS Jagan: తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినే, మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు మేం బహిష్కరించలేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు వెళ్లామన్నారు. ఇక, నాకు ప్రతిపక్ష నేత హోదాపై కోర్టుకు స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇక, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోర్టుకు స్పందించడం లేదు.. అన్ని ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే.. ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. నా ఆరోపణలకు వాళ్లు సమాధానం చెప్పాలి.. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకు అని వైఎస్ జగన్ అన్నారు.
Read Also: YS Jagan: గ్యారంటీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నారు..
అలాగే, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకు మద్యానికి సంబంధమేంటి?.. ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని సెటైర్లు వేశారు. ఇక, ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు.. మద్యం రేట్లు మేం పెంచామా?.. మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?.. రేట్లు పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకు మమూళ్లు ఇస్తారా? అని క్వశ్చన్ చేశారు. నాలాగా ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కలేకపోతున్నాడు? అని జగన్ ప్రశ్నించారు.
Read Also: Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!
ఇక, నాకు డబ్బుపై వ్యామోహం లేదు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామన్నారు. బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి.. ప్రలోభాలకు లొంగో, భయపడో లేక రాజీపడో అటు పోతే విశ్వసనీయత సంగతేంటి? అని అడిగారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి.. ఐదేళ్లు కష్టపడితే మనం టైం వస్తుంది.. విశ్వసనీయత ముఖ్యం.. ఇది విజయసాయిరెడ్డికైనా.. మిగతావారికైనా అని వైఎస్ జగన్ సూచించారు.