Vijayawada: పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు.. ఆందోళనకు దిగిన వాహనదారులు
- పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు
- వాహనాలు మొరాయించటంతో ఆందోళనకు దిగిన వాహన దారులు
- విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పెట్రోల్ బంకులో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: పెట్రోల్ బంకులు ఎప్పుడూ వాహనదారులతో రద్దీగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టడంతో పాటు రద్దీగా ఉన్న సమయంలో బంకుల్లో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తక్కువగా రావడం, రీడింగ్‌లో మోసం, కొలతలో మోసం, నాణ్యత లేని ఇంధనం, ఎక్కువ డబ్బు తీసుకోవడం లాంటి మోసాలు ఇటీవల జరగుతున్నాయి. ఇది కాకుండా మరికొన్ని చోట్ల పెట్రోల్‌కు బదులు నీళ్లు కూడా వస్తున్నాయి. నిజమేనండోయ్.. దీని కారణంగా వాహనాలు కూడా పాడవుతుంటాయి. ఇలాంటి సంఘటనే తాజాగా విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్పెట్రోల్ బంక్ లో వాహనదారులు పెట్రోలు పోసుకొని ఒక కిలోమీటర్ దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోతున్నాయి. ఎందుకు ఇలా జరిగిందో అని వాహనదారులు మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లగా.. పెట్రోల్‌లో నీరు కలిసిందని వారు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.
Read Also: NEET-UG: నీట్-యూజీ పరీక్ష రద్దుపై రేపు సుప్రీం కోర్టులో విచారణ..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీళ్ల కలపడం వల్ల వాహనాలు మొరాయించడంతో వాహనదారులు బంకు ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా.. కొంతమంది వాహనదారులు పెట్రోల్ బంక్ దగ్గరికి వాహనాలను తీసుకువచ్చి వారి వాహనాలలో నుండి పెట్రోల్ తీయించి మరి యాజమాన్యానికి చూపించారు. వర్షం నీళ్లు రావడంతో నీళ్లు కలిశాయని.. పొరపాటు జరిగిందని బంక్ యజమాని చెప్పారు. వాహనాల్లో పెట్రోల్ మొత్తం బయటికి తీసి మళ్లీ పెట్రోల్ కొట్టి ఇస్తానని బంక్ యజమాని చెప్పారు. వాహనదారులకు మరమ్మతులు చేసి ఇస్తానని హామీ ఇవ్వడంతో వాహన దారులు ఆందోళన విరమించారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?