NTV Telugu Site icon

YS Jagan: డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటించిన జగన్

Jagan

Jagan

YS Jagan: విజయనగరం జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై హాట్‌ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను.. డయేరియాతో ఆస్పత్రిపాలైనవారిని పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.. కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యింది.. 14 మంది డయేరియాతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.. సెప్టెంబర్ లో మొదటి కేసు నమోదైనా 35 రోజులపాటు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. గుర్ల, ఘోషాడలో తీవ్రంగా డయేరియా ప్రబలింది.. గుర్ల గ్రామాల్లో డయేరియాతో నేను ట్వీట్ చేస్తేనే ప్రభుత్వం స్పందించిందన్నారు..

Read Also: Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టిన సెబీ చీఫ్‌

ఇక, వ్యాధి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.. చంపావతి నదిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.. మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు.. క్లోరినేషన్ జరిగిందో లేదో కూడా పట్టించుకోలేదు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. సచివాలయ సహాయ సహకారాలు తీసుకోవాలనే ఆలోచనే లేదు.. శానిటేషన్ పట్టించుకోలేదు.. 345 మంది డయేరియాతో ప్రభుత్వ ఆసుపత్రిలో, 100 మందికి పైగా ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు.. ఇష్యూ ని కవర్ చేసుకోవాలనే దిక్కుమాలిన ఆలోచనలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.. మండలంలో 14 మంది చనిపోతే కనీసం విశాఖ కేజీహెచ్ కి తీసుకెళ్లలేకపోయారంటూ ప్రశ్నించిన జగన్.. గ్రామీణ ప్రజల పట్ల ప్రభుత్వం అశ్రద్ధగా ఉందన్నారు..

Read Also: MLC Jeevan Reddy: అవమానంగా భావిస్తున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ లకు జీవన్ రెడ్డి లేఖ..

మేము అభివృద్ధి చేసిన స్కూల్లోనే వైద్యం అందించాడు.. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? అని ప్రశ్నించారు జగన్.. ప్రభుత్వం నుండి సహాయం చేయకపోగా, డయేరియా వలన చనిపోయినట్లు చెప్పొద్దంటూ బాధిత కుటుంబాలకు అధికారులు చెప్పడం దారుణం అన్నారు.. ఆరోగ్య శ్రీ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేకపోతుంది.. నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కాలేజీలను అమ్మేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.. ఆరోగ్యశ్రీ లో 25 లక్షలు వరకు ఉచిత వైద్యము అందించాం.. దానిని కూడా ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. 65 మంది ఇప్పటికే చికిత్స పొందుతున్నారు.. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. డయేరియా మృతుల కుటుంబాలకు రెండు లక్షలు పరిహారం అందజేస్తున్నాం.. ఏదైనా ఇష్యూ జరిగితే డైవర్షన్ ఎలా చేయాలో చూస్తున్నారు తప్పా పని చేయరు అని దుయ్యబట్టారు వైఎస్‌ జగన్‌..