Site icon NTV Telugu

Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై కలెక్టర్ అంబేద్కర్‌ ఫైర్..

Vzm Collecter

Vzm Collecter

Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు వ్యక్తిగత సెలవులపై వెళ్తున్నారు.. తన ఒత్తిడి కారణంగా వెళ్తున్నారని మంత్రి కొండపల్లి ఇన్ఛార్జ్ డీఆర్వో వద్ద ప్రస్తావించారు.. తన ఆదేశాలు లేకుండా మంత్రిని కలిస్తే కఠిన చర్యలే.. గ్రీవెన్ లో ఉన్న జిల్లా అధికారులకు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగాలు చేసుకుంటారా.. రాజకీయాల చేసుకుంటారా.. తేల్చుకోండి అని పేర్కొన్నారు. కొంత మంది అధికారులు సెలవులపై వెళ్తున్నారు.. దీనిని కొందరు వక్రీకరిస్తున్నారు అని కలెక్టర్ అంబేడ్కర్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also: IPL Final: ఐపీఎల్ ఫైనల్‌పై రాజకీయం.. బీసీసీఐ నిర్ణయంపై తృణమూల్ ఆగ్రహం..

ఇక, కలెక్టర్ వేధింపులు కారణంగా సెలవులపై వెళ్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు అని విజయ నగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. బదిలీల కోసం రాజకీయ నాయకులను ఉద్యోగులు కలుస్తున్నారా అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ విషయం నా దృష్టికి వచ్చిందంటే ఊరుకునేదే లేదు అన్నారు. సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటే సరేసరి.. లేకుంటా నేను చెయ్యాల్సింది చేస్తాను అని కలెక్టర్ అంబేద్కర్ మండిపడ్డారు.

Exit mobile version