Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramateertham incident: విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం ధ్వంసమైన శ్రీ కోదండ రామస్వామి విగ్రహాలను నేడు ఆగమశాస్త్ర ప్రకారం నిమజ్జనం చేయనున్నారు. రామ తీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలిస్తారు. నెల్లిమర్ల మండలం రామ తీర్థంలోని నీలాచల పర్వతంపై వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి దుండగుల దాడిలో పురాతన రాముడి విగ్రహం ధ్వంసం కావడం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై కేసులు నమోదై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.
Read Also: Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
అయితే, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ధ్వంసమైన విగ్రహాలను ఆలయంలో ఉంచకూడదనే నిబంధనతో.. రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణుడి పాత విగ్రహాలను జలాధివాసం చేయాలని నిర్ణయించారు. అయితే, విచారణలో భాగంగా విగ్రహ శిరస్సు భాగం కోర్టులో ఉండటంతో ఆలస్యమైంది. తాజాగా, కోర్టు అనుమతి లభించడంతో నిమజ్జనానికి మార్గం సుగమమైంది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నారు.
రామతీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, సింహాచలం, అనకాపల్లి నూకాంబిక, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం వంటి ప్రముఖ ఆలయాల మీదుగా ఊరేగింపుగా తీసుకెళ్లి.. మధ్యాహ్నం 3.45 గంటలకు కోటిపల్లి చేరుకుంటారు. ఇక, ఊరేగింపు ముగించుకొని సాయంత్రం 4.48 గంటలకు గోదావరి తీరంలో వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!