Site icon NTV Telugu

Minister Sandhya Rani: వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. యుగాంతం అయిపోవాలి..!

Minister Sandhya Rani

Minister Sandhya Rani

Minister Sandhya Rani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరలా అధికారంలోకి రావాలంటే… యుగాంతం అయిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.. ఓ మాజీ సీఎం.. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం ఎంతవరకు కరెక్ట్? అని నిలదీశారు.. జగన్‌ సభ్యత సంస్కారం లేని వారిలా మాట్లాడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు.. గొడ్డలి పోటుకు.. గుండె పోటుకి తేడా తెలియని వారు.. కోడి కొత్తి డ్రామాలు చేసినవారు.. పదవులు కోసం.. సొంత తల్లినే ఇంటి నుండి గెంటశారు.. ఆస్థి కోసం చెల్లిని బయటకు నెట్టేసినవారు అంటూ కామెంట్ చేశారు.

Read Also: Tahawwur Rana: కసబ్‌కి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది.. తహవూర్ రాణా అప్పగింతపై కేంద్రమంత్రి..

ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి వన్‌ ప్లెస్.. వన్‌ భద్రత ఇవ్వాలి.. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి వారు కాబట్టి , జగన్ మోహన్ రెడ్డి.. నీకు అంత సెక్యూరీటీ ఇచ్చారు.. నీకు 200 మంది పోలీసులు ఎందుకు, నీ డ్రామాలు వినడానికి ఎవరూ రెడీగా లేరన్నారు సంధ్యారాణి.. నీ వద్దకు జనాలు రావడం లేదు.. 100 మందిని డబ్బులు ఇచ్చి తెప్పించుకొని.. మీద.. మీద పడేసుకొని, ఇది పోలీసులు వైఫల్యం అని చెబుతున్నావు.. పోలీసులు యూనిఫామ్ నువ్వు తీసేస్తావా..? పోలీస్ యూనిఫామ్… అరటి తొక్క అనుకుంటున్నావా..? తీసి పారేయడానికి.. అని ఒక పోలీసు సోదరుడు బాగా అడిగాడు..? సెటైర్లు వేశారు.. ఇక, వైసీపీ మరలా అధికారంలోకి రావాలంటే.. యుగాంతం అయిపోవాలి అని జోస్యం చెప్పారు.. రెడ్ బుక్ అంటే.. ఒక్కొక్కరికి షర్ట్ లు తడిసిపోతున్నాయిన అని వ్యాఖ్యానించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

Exit mobile version