Minister Kondapalli Srinivas: భూ సమస్యల సత్వర పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు..

  • భూ సమస్యల సత్వర పరిష్కారానికే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..
  • ఈ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపు..
  • విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సు..
  • పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
Minister Kondapalli Sriniva

Minister Kondapalli Sriniva

Minister Kondapalli Srinivas: ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం అయ్యాయి.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పరిష్కారం కాని భూ సమస్యలను.. సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.. కూటమి ప్రభుత్వ వచ్చాక భూ వివాదాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

Read Also: Bitcoin : కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.. 24గంటల్లో రూ.10లక్షలు నష్టం

×
×
Ad

ఇక, ప్రతీ రైతన్న.. తమ భూమికి సంబంధించిన వివరాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చెక్ చేసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం హయాంలో పలు లోటు పాట్లు జరిగాయి. జిల్లాలో 9 వేల దరఖాస్తులు భూ సమస్యలుపై వచ్చాయి.. ఇకపై భూ సమస్యలు రాకుండా చూసే విధంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.. ఈ అవకాశం మరలా మీకు రాదు.. రెవెన్యూ అధికారులు మీ వద్దకు వచ్చేటప్పుడు.. మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్..