Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Emotional: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకున్నారు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం భావోద్వేగంగా సాగింది. సమావేశంలో బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో సభలో విషాద వాతావరణం నెలకొంది. పార్టీ కోసం కలిసి నడిచిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
మజ్జి శ్రీనివాసరావు పార్టీ మార్పుపై ఆవేదన
జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారడంపై సమావేశంలో కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు మాట్లాడారు. పార్టీ కోసం కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే, మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరగడానికి బొత్స సత్యనారాయణే కారణమంటూ పలువురు నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానించారు. ఏ చిన్న పని ఉన్నా ‘చిన్న శ్రీను’ దగ్గరకు తమను పంపింది కూడా బొత్సేనని సమావేశంలో ప్రస్తావించారు. ఆయనతో తమకు ఏర్పడిన అనుబంధానికి బొత్సే కారణమని గుర్తుచేశారు.
Also Read
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
కార్యకర్తల మాటలతో బొత్స భావోద్వేగం
కార్యకర్తలు, నాయకులు గత అనుబంధాలను గుర్తుచేసుకుంటూ మాట్లాడుతున్న సమయంలో బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో సమావేశంలో ఉన్న కార్యకర్తలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో సభ మొత్తం భావోద్వేగ వాతావరణంలోకి వెళ్లింది. పార్టీ కోసం కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మజ్జి శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ పలువురు నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?