Vizag Triangle Love Story: ఇటీవల వచ్చిన ‘బేబీ’ సినిమాను అందరూ చూసే ఉంటారు. అందులో హీరోయిన్ స్కూల్ డేస్‌లో ఒకరిని, కాలేజీ రోజుల్లో మరొకరిని ప్రేమించి.. చివరికి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. సరిగ్గా అలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీనే వైజాగ్‌లో వెలుగు చూసింది. ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడిపిన ఓ యువతి.. మరొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా బాయ్‌ఫ్రెండ్స్‌తో చనువుగా ఉండటంతో.. భర్తకు అనుమానం వచ్చి నిలదీశాడు. దీంతో.. ఆ యువతి నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగోతం బట్టబయలైంది. తాను రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో అవమానంగా భావించిన ఆ యువతి.. ఆత్మహత్య చేసుకుంది.
Viral Video: కళ్లజోడు పెట్టుకొని బైక్ మీద దర్జాగా కూర్చున్న సింహం…. అసలు విషయం ఏంటంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన ఓ యువతి ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించింది. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా.. సీక్రెట్‌గా వారితో ప్రేమాయణం కొనసాగింది. ఇలా వీరితో లవ్ ఎఫైర్ కొనసాగిస్తూనే.. మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అయితే.. పెళ్లైన తర్వాత కూడా ఆ యువతి తన ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో చనువుగా ఉంటూ వచ్చింది. భర్తకు తెలియకుండా ఆ ఇద్దరిని కలిసేది. ఆ ఇద్దరితో తన భార్య చాలా చనువుగా మెలుగుతుండటంతో.. భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆయన నిలదీశాడు. అప్పుడు ఆ యువతి నడిపించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగోతం బయటపడింది. అటు.. ఆమెకు పెళ్లయ్యిందన్న విషయం తెలుసుకున్న ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్ కూడా ఆమె ఇంటికి వెళ్లి కడిగిపారేశారు. చివరికి ఎవరితో ఉంటాడో తేల్చుకో అంటూ గొడవ చేశారు.
ఇలా ముగ్గురికీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో.. ఆ యువతి అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఓ ప్రియుడు తీవ్ర మనస్తాపానికి గురై, రైల్వే ట్రాక్ మీద పడుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. యువతి రాసిన ఒక లెటర్ దొరికింది. తన లవర్ సూర్య ఎవరినీ వదలకు అందరూ కుక్క చావు చావాలంటూ ఆ లెటర్‌లో రాసింది. నువ్వే నా ఫ్యావరెట్ పర్సన్ అని, నేను లేకపోయినా నా ఆత్మ నీకు తోడుగా ఉంటుందని పేర్కొంది. నువ్వే నా రక్తం, నువ్వు నా ప్రాణమంటూ.. మళ్లీ జన్మలో ఏ కుక్కగానో పిల్లిగానో పుడతానని చెప్పింది. తల్లిదండ్రులు తనకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారని, మీ నలుగురు జాగ్రత్త ఉండాలంటూ ఆ లెటర్‌లో ప్రస్తావించింది.