Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- పోర్టుల నిర్లక్ష్యంతో పెరుగుతున్న బొగ్గు కాలుష్యం
- శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిన విశాఖ ప్రజలు
- గ్రీన్ బెల్ట్, SOPల అమలుపై నిపుణుల హెచ్చరిక
- మూలపేట పోర్ట్‌తో తగ్గనున్న విశాఖపై ఒత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని, పర్యాటక స్వర్గధామం విశాఖపట్నం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన సముద్రపు గాలితో సేదతీర్చిన ఈ నగరం, నేడు విషతుల్యమైన బొగ్గు పొడితో నిండిపోతోంది. విశాఖ , గంగవరం పోర్టుల కార్యకలాపాలు నగరం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అక్కడి కార్గో హ్యాండిలింగ్ , రవాణాలో జరుగుతున్న ఘోరమైన వైఫల్యాలు స్థానిక ప్రజల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. ప్రధానంగా ఓపెన్ యార్డ్‌లలో బొగ్గు, ఇనుప ఖనిజాన్ని నిల్వ చేయడం వల్ల గాలి వీచినప్పుడల్లా ఆ దుమ్ము నగరంపైకి వ్యాపిస్తోంది. ఈ ఖనిజాలను లారీల ద్వారా తరలించేటప్పుడు టార్పాలిన్లు కప్పకపోవడం, నిల్వ ఉంచిన గుట్టలపై వాటర్ గన్స్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు చిలకరించకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల గాలిలో కాలుష్య కారకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం కార్గోను మూసి ఉంచాల్సిన చోట, బహిరంగంగా వదిలేయడం వల్ల నగరం నల్లటి పొరతో కప్పబడిపోతోంది.
ఈ కాలుష్యం ప్రభావం నేరుగా ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో స్థానికులు ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రమైన కంటి సమస్యలు , గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇళ్లలోకి నల్లటి బొగ్గు పొడి విపరీతంగా చేరుతోందని, రోజుకు పది సార్లు ఇల్లు తుడుచుకోవాల్సిన పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగవరం గ్రామస్థుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; తాము పుట్టి పెరిగిన ఊరిలో ఉండలేకపోతున్నామని, ప్రభుత్వం తమకు వేరే చోట పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో వాయు కాలుష్యం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి చేరుకోవడంపై పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టడానికి పోర్టులు , భారీ పరిశ్రమల చుట్టూ కనీసం 100 అడుగుల మేర దట్టమైన చెట్లను పెంచి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.
Also Read
- Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
- AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు 'నేషనల్ ఈ-విధాన్' (NeVA) శిక్షణ..
- Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. రూ.1.78 కోట్లతో ఆరు వాహనాలు కొనుగోలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తీవ్ర తుఫాన్‌గా మారనున్న 'అక్వాన్'..
మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్ట్ త్వరగా అందుబాటులోకి వస్తే, విశాఖకు వచ్చే కార్గోలో మెజారిటీ అక్కడికి తరలిపోయే అవకాశం ఉంది, తద్వారా విశాఖపై ఒత్తిడి తగ్గి కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం కార్గో హ్యాండిలింగ్ జరిగేలా కాలుష్య నియంత్రణ మండలి కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖను “సిటీ ఆఫ్ డెస్టినీ” అని పిలుచుకుంటాం, కానీ ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో విఫలమైతే ఆ పేరు అర్థరహితంగా మారుతుంది. ప్రభుత్వం , పోర్ట్ యాజమాన్యాలు తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
-
Aaryavir Sehwag: పాక్‌పై గెలుపు వెనుక అసలు ప్లాన్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్! సెహ్వాగ్!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
CM Revanth Reddy- PM Modi: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!