NTV Telugu Site icon

Love Tragedy: మరో యువతితో పెళ్లి.. ప్రియురాల్ని మర్చిపోలేక యువకుడు ఆత్మహత్య

Boy Suicide By Poison

Boy Suicide By Poison

Vizag Boy Killed Himself After Marriage For Lover: విశాఖపట్నంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన తర్వాత తాను ప్రేమించిన యువతిని మర్చిపోలేక.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రేమికుడ్ని కాపాడుకోవడానికి ప్రియురాలు సాయశక్తులా ప్రయత్నించింది కానీ, ఫలితం లేకుండా పోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం ఉక్కునగరానికి చెందిన రుంజల కిరణ్ బాబు (33) ఓ యువతిని ప్రేమించాడు. ప్రియురాలిది అచ్యుతాపురం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా డీప్‌గా వీళ్లు ప్రేమించుకున్నారు. అయితే.. కిరణ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి ప్రేమ వ్యవహారం గురించి తెలియదు. దీంతో.. అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించారు. ధైర్యం చాలక.. తన ప్రేమ వ్యవహారాన్ని పేరెంట్స్‌కి కిరణ్ చెప్పలేకపోయాడు. ఏం చేయలేక వాళ్లు చూపించిన యువతితోనే జనవరి 26న పెళ్లి చేసుకున్నాడు.

Turkey Earthquake : టర్కీ భూకంప నష్టం 342కోట్ల డాలర్లు.. మన కరెన్సీలో ఎంతో తెలుసా?

అయితే.. పెళ్లి అయ్యాక తాను ప్రేమించిన యువతిని కిరణ్ మర్చిపోలేకపోయాడు. ప్రతిరోజూ లోలోపలే మదనపడుతూ వచ్చాడు. చివరికి ఆ బాధను భరించలేక.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందు తాగేశాడు. అనంతరం తన ప్రియురాలికి ఫోన్ చేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, పురుగుల మందు తాగేశానని పేర్కొన్నాడు. అది విన్న వెంటనే ప్రియురాలు హటాముటిన ప్రియుడి ఇంటికి చేరుకుంది. అప్పటికే కిరణ్ శరీరంపై ఆ పురుగల మందు తీవ్ర ప్రభావం చూపింది. అతడు కొన ఊపిరితో ఉన్న విషయం గ్రహించి, ప్రియురాలు ఆసుపత్రికి తరలించింది. అయితే.. మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కిరణ్ మృతితో ప్రియురాలు, భార్య, కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Revanth Reddy: భూపాలపల్లిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డిపై టమోటా, గుడ్లతో దాడి