Site icon NTV Telugu

Botsa Satyanarayana: మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది.. ఓపికతో ఉండండి..!

Botsa

Botsa

Botsa Satyanarayana: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉండాలి అని సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.. అయితే, అనుకున్న సమయానికి కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు.. కూటమి పాలనలో విశాఖ అవినీతికి అడ్డాగా మారింది.. అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రియాంబర్స్ మెంట్ లేదు.. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఏడాదిలో కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. తెచ్చిన డబ్బుకు లెక్క లేదని ఆరోపించారు.

Read Also: Donald Trump: “నాకు సరైన క్రెడిట్ ఇవ్వలేదు..” కాల్పుల విరమణపై మరోసారి స్పందించిన ట్రంప్

రుషికొండ అద్భుత కట్టడమే.. రుషికొండలో అవినీతి జరిగితే బిల్లులు ఎందుకు చెల్లించారు అని ప్రశ్నించారు బొత్స.. కక్ష సాధింపు చర్యలను ప్రజలు హర్షించరన్న ఆయన.. కార్యకర్తలకు, నాయకులకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురండి.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, వైసీపీ మీకు అండగా ఉంటుందని నాయకులు, కార్యకర్తలకు సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..

Exit mobile version