Site icon NTV Telugu

Botsa Satyanarayana: వైఎస్‌ హయాంలోనే మేం ఐటీని ప్రోత్సహించాం..

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: వైఎస్‌ హయాంలోనే మేం ఐటీని ప్రోత్సహించామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది.. సామాన్యుడి మనుగడ కష్టమైపోయింది.. మేము ఒత్తిడి చేస్తేనే హామీలు అమలు చేస్తున్నారు.. మా ఒత్తిడి వలనే రేపు అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు.. పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు.. మా నాలుక మందం కాదు.. ప్రభుత్వ మెడలు వంచి పథకాలు ఇచ్చేలా చేస్తామని చెప్పాం అన్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీనించాయి.. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదు.. మాజీ మంత్రి పరామర్శకు జగన్ వెళ్తే జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.. జగన్ పర్యటనకు జనం వస్తే టీడీపీ నేతలు ఎందుకు రగిలిపోతున్నారు..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా కోసం ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు ఖండించలేదు.. గతంలో ఎప్పుడూ విశాఖలో డ్రగ్స్ కల్చర్ లేదు.. ఈ ప్రభుత్వం వచ్చాకే డ్రగ్స్ కేసులు పెరగవు.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో కమిషనర్ ముందు ఒకలా తరువాత మరోలా మాట్లాడారు.. విశాఖలో క్రైమ్ రేట్ లెక్కలు చూస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.. పోలీసు వ్యవస్థను పని చెయ్యనివ్వడం లేదు అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

Read Also: Harish Rao: సాగునీటి ప్రాజెక్టుల పై లోకేష్ కు అవగాహన లేదు..

లూలు సంస్థకు ఉద్యోగాల కోసం భూములు ఇస్తున్నారా..? లాలూఛీ పడి భూమి ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు బొత్స.. పబ్లిక్ గా వేలం వేసి భూమి కేటాయించవచ్చు కదా..? లూలు సంస్థకి భూమి కేటాయించడం చూస్తుంటే ప్రభుత్వ దోపిడీ కనిపిస్తుందన్నారు. టీసీఎస్‌ సంస్థలో ఉద్యోగాలు తీసేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. విశాఖలో ఐటీని డా. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రోత్సాహించారని తెలిపారు.. P4 పేరుతో ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.. P4 విధివిదానాలు ఏమిటి..? ప్రజలకు సమాధానం చెప్పాలి కదా..? అని నిలదీశారు.. పరిపాలన చేతకాక మా మీద ఆరోపణలు చేస్తున్నారు.. తల్లికి వందనం ఎప్పుడైనా వాయిదా పద్ధతిలో ఇచ్చామా..? ఈ ప్రభుత్వం వాయిదా పద్దతిలో తల్లికి వందనం డబ్బులు వేస్తుంది.. ? అని ప్రశ్నించారు.. ఉచిత బస్సు కూడా మా ఒత్తిడి వలనే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దపడింది.. రూ.1.5 లక్షల కోట్లపైగా అప్పులు చేశారు.. మేము frbm లిమిట్ ప్రకారమే అప్పులు చేసాం.. ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్ళాం.. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పులు పుడుతున్నాయి.. వీరి మొహం చూసి ఎవరైనా అప్పులు ఇస్తారా..? అని మండిపడ్డారు..

Read Also: Peddi: విజయనగరంలో చరణ్ పోరాటం

సింగపూర్ కంపెనీ వెళ్ళిపోతానని చెప్తే బ్యాలెన్స్ డబ్బులు కట్టమని అడిగాం.. తప్పేముంది..? అని ప్రశ్నించారు బొత్స.. రాజధాని నిర్మాణానికి స్క్వేర్ ఫీట్ కి రూ. 14-15 అవుతుంది.. దేశంలో ఏ ప్రాంతంలో ఇంత ఖర్చు అవ్వదు.. అందుకే కంపెనీలు ముందుకు రావడం లేదు.. ఇందులో ఇరుక్కుపోకూడదనే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.. మా హయాంలో ఎప్పుడూ ఫీజు బకాయిలు లేవు.. ఈ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ మెంట్ ఆపేసారు.. విద్యార్థుల మీద కోపం ఎందుకు..? వర్షాలు లేక భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.. రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.. రైతులను ప్రభుత్వం లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదుకోవాలి.. రైతుల తరఫున ఇన్సూరెన్స్ మేము కట్టేవాళ్ళం.. ఇప్పుడు రైతులనే కట్టుకోవాలని ప్రభుత్వం చెప్తుంది.. రాష్ట్రంలో ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు.. మే 15 నుంచి ఉపాధి హామీ కూలీ డబ్బులు రాలేదు.. 75 రోజులుగా కూలీలకు డబ్బులు లేవు అని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..

Exit mobile version