Jagga Reddy: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒక పెద్ద చరిత్ర అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. 1966 అక్టోబర్ లో అమృతరావు AIICC సభ్యుడు, ఢిల్లీ వరకూ వెళ్ళి నిరాహారదీక్ష చేశారు.. బ్రహ్మానందరెడ్డి స్టీలు ప్లాంటుకు సానుకూలంగా నిర్ణయం ఇచ్చారు.. సోనియాగాంధీ పార్లమెంటులో ప్రకటన చేశారు.. స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు.. స్టీల్ ప్లాంటు అనేది కాంగ్రెస్ కృషి.. 14 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన స్టీల్ ప్లాంటు ప్రజలకు ఉపాధి కల్పించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు స్టీలు ప్లాంటు హక్కు అనేది ఒక చరిత్ర.. స్టీల్ ప్లాంటు కోసం వెంకయ్యనాయుడు కూడా మాట్లాడారు.. యూపీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంటును కాపాడుకుంటూ వచ్చింది.. ఆనాటి రూ. 14 వేల కోట్ల సంపద ఇవాళ 2.5 లక్షల కోట్లుగా ఉందని జగ్గారెడ్డి చెప్పారు.
Read Also: Cyber Crime : సిమ్ కార్డ్ లతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు..
ఇక, స్టీలు ప్లాంటు మీద ప్రధాని మోడీ కన్ను పడిందని మాజీ ఎమ్మె్ల్యే జగ్గారెడ్డి తెలిపారు. స్టీలు ప్లాంటును ఎవరికో కట్టబెట్టాలనే దురుద్దేశంతో ప్రయత్నాలు మొదలయ్యాయి.. ఏపీ కాంగ్రెస్ లో రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు.. ఏపీ విభజనపై కోపంతో ప్రజలు మాకు ఓటేయ్యలేదు.. ఏపీలో పోలీసు వ్యవస్థ ప్రభుత్వం దగ్గర ఉంది.. మేం ఏమీ చేయలేని పరిస్ధితుల్లో స్టీల్ ప్లాంటు ఆస్తిని కార్పొరేట్ వ్యవస్థకు అప్పగించాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇప్పటికైనా చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లకు ప్రధాని మోడీతో మంచి స్నేహం ఉంది.. ఇక్కడ సీఎంలు మారారు అంతే స్టీలు ప్లాంటు ఉద్యమం నడుస్తూనే ఉంది.. ఇంకా అలాగే, స్టీలు ప్లాంటు కార్మికుల టెంట్లు ఉన్నాయని జగ్గారెడ్డి గుర్తు చేశారు.
Read Also: Duvvada Srinivas: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది.. ఎమ్మెల్సీ దువ్వాడ సంచలన ఆరోపణలు..
అయితే, ఏపీ ప్రజలు ఏం మైకంలో ఉన్నారు.. జగన్, పవన్, చంద్రబాబు ముగ్గురు హీరోల యాక్టింగ్ ఎందుకు గమనించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. నేనేమీ ఆంధ్ర ప్రజలను తక్కువ అంచనా వేయడం లేదు.. కులాల మీద రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడి రాజకీయ నాయకులు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మర్చిపోయారా, ఎందుకు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. ఏపీలో కాంగ్రెస్ ఉండదని తెలిసి కూడా మాట ఇచ్చినందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తరువాత స్టీలు ప్లాంటుపై మొదటి సంతకం చేస్తారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు.
Read Also: Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
ఇక, రాహుల్ గాంధీ కుటుంబం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు మాట ఇచ్చినట్టే, ఏపీకి కూడా మాట ఇచ్చే పరిస్ధితి ఉంది.. ఏపీలో కాంగ్రెస్ ను 25 ఎంపీ సీట్లతో గెలిపించండి.. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయాలని కోరారు. ఏపీ కాంగ్రెస్ లో ప్రతినిధులు లేరు, ఇక్కడ నాయకుల దగ్గర డబ్బులు లేవు.. రాష్ట్ర విభజన మాత్రమే ఏపీ ప్రజల కోపానికి కారణం.. నా శాయశక్తులా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆశీర్వాదం పొందేందుకు చూస్తా.. నేను రాష్ట్ర విభజన చేయకండి అని చెప్పాను.. జగన్ కూడా విభజనకు సపోర్టుగా లెటర్ ఇచ్చాడు.. నేనే ఉమ్మడి రాష్ట్రం ఉండాలని కోరాను.. తెలంగాణ గడ్డ మీదనే అన్నాను.. ఉమ్మడి రాష్ట్రం ఉండాలని.. ఏపీలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వదిలేయలేదు.. జగన్, కేసీఆర్ ఒకరి ఒకరు వెళ్ళి కోడి కూర తిన్నారు.. కానీ, రేవంత్ రెడ్డి అలాంటి పని చేయలేదని జగ్గారెడ్డి తెలియజేశారు.