Site icon NTV Telugu

Vizag Metro Rail: విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో కీలక ముందడుగు..

Vizag Metro Train

Vizag Metro Train

Vizag Metro Rail: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ యూనిక్ డిజైన్ తో నిర్మాణ పనులకు సిద్ధం అవుతోంది. అక్టోబర్‌లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా… 30 నెలల గరిష్ఠ కాలపరిమితిలో పూర్తి చేయాలని APMRCL నిర్దేశించుకుంది. ఫస్ట్ ఫేజ్ కింద మూడు కారిడార్లు, 46.63 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరగనుంది. ఎన్ఏడీ జంక్షన్, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక కూడళ్ళలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు సహా 42 మెట్రో స్టేషనులు ఏర్పాటు కానున్నాయి.

Read Also: Coolie : లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ కథ నేపధ్యం ఇదే.. తేడా వస్తే అంతే సంగతులు

విశాఖ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. సిటీ మీదుగా వెళుతున్న ఓల్డ్ నేషనల్ హైవే నిత్యం రద్దీగా ఉంటోంది. ఏటికేడాది వాహనాల సంఖ్య పెరుగుతుండగా సమస్య జటిలంగా మారుతోంది. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పది ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. అయితే, మెట్రో రైలు ఏర్పాటు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించి ఆ ప్రయత్నం విరమించారు. కారిడార్ వన్ కింద కొమ్మాది- స్టీల్ ప్లాంట్ మధ్య నిర్మించే 34.40 కిలోమీటర్ల కారిడార్లో భాగంగా మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 8 ఫ్లైఓవర్‌లను అనుసంధానం చేసి ఒకే వంతెనగా నిర్మిస్తారు. గాజువాక – స్టీల్ ప్లాంట్ మధ్య మరొకటి రానుంది. మొత్తంగా 20 కిలోమీటర్లలో డబుల్ డెక్కర్ వస్తుంది. ఇక్కడ కింద రోడ్డు… దానిపైన నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్‌లు వాటిపైన మెట్రో ట్రాక్ రానుంది. ఇది పూర్తయితే ఆసియా ఖండంలోనే పొడవైన డబుల్ డెక్కర్ మెట్రోగా విశాఖ మెట్రో గుర్తింపు పొందనుంది.

Read Also: Fake Apple Products: చౌక ధరకే నకిలీ యాపిల్‌ ప్రాడక్ట్స్‌.. యాపిల్‌ ప్రియులే టార్గెట్‌

మొదటి కారిడార్‌కు లైన్ క్లియర్ అవ్వగా… గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు వెళ్ళే మార్గంలో అలైన్‌మెంట్‌ అభ్యంతరాలు తెరపైకి వస్తున్నాయి. జగదాంబ వంటి ప్రధాన బిజినెస్ సెంటర్ల మీదుగా వెళ్ళే మార్గంలో నిర్మాణాలు, షాపింగ్ ఏరియాల్లో భూ సేకరణ అవసరం అవుతుంది. మొత్తం 100ఎకరాలు అవసరం అవుతుందని తేల్చగా….వీటిలో 10 ఎకరాలు మాత్రం ప్రైవేట్‌కు చెందినవి. నిబంధనల ప్రకారం భూ సేకరణ చేసి అభివృద్ధి ప్రాజెక్టులో వాళ్ళను భాగస్వామ్యులను చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మెట్రో రైలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన వాటాలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కానుంది. వీఎంఆర్డీఏకు అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 1,941.19 ఎకరాల భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రైతుల నుంచి సమీకరించిన భూములకు పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తారు. మిగిలిన భూములను వీఎంఆర్డీఏ విక్రయిస్తుంది. ఈ ప్రక్రియలో వచ్చిన నిధుల్లో కొంత మెట్రో ప్రాజెక్టుకు కేటాయించనుంది ప్రభుత్వం.
1,941.19 ఎకరాల భూసమీకరణకు వీఎంఆర్డీఏకు అనుమతి..

Exit mobile version