Vizag Drug Case: విశాఖ డ్రగ్స్ కేసులో రాజకీయ ఒత్తిడి లేదు..
- విశాఖ డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతం..
- చాక్లెట్ చాక్లెట్ కోడ్‌లో డ్రగ్స్ లావాదేవీలు..
- విశాఖ డ్రగ్స్ కేసు రాజకీయ ఒత్తిడి లేదు: సీపీ బాగ్చీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Drug Case: విశాఖ పట్నంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. అయితే, అరెస్ట్ చేసిన వారిలో సౌతాఫ్రికాకు చెందిన థామస్‌ను వారం రోజుల పాటు, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, డాక్టర్ కృష్ణ చైతన్యను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు. వారి కాల్ డేటా, వాట్సాప్ డేటా ఆధారంగా కీలక సమాచారం లభించిందని వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు ఢిల్లీకి ప్రత్యేక బృందాలను పంపినట్టు చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణలో మరో 8 మందిని అనుమానితులను గుర్తించామని విశాఖ సీపీ బాగ్చీ ఎన్టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Also: Kaantha: ‘కాంత’ దాసులయ్యేందుకు పోటీ!
Also Read
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
అయితే,చాక్లెట్ చాక్లెట్ అనే కోడ్ భాషలో డ్రగ్స్ కొనుగోలు జరుగుతుందని టెక్నికల్ టీమ్ దీన్ని గుర్తించిందని వైజాగ్ సీపీ శంఖబ్రత బాగ్చీ చెప్పుకొచ్చారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న త్రీ టౌన్ సీఐ, ఈస్ట్ జోన్ ఏసీపీలు సెలవుపై వెళ్లడం పలు అనుమానాలు రావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ విభాగాలకు చెందిన 8 మంది సభ్యులతో కూడిన బృందం కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తి లేదు.. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నా వారిని పూర్తి ఆధారాలతో అరెస్టులు చేస్తామని పోలీస్ కమిషనర్ బాగ్చీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?