Vizag Drug Case: విశాఖ పట్నంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. అయితే, అరెస్ట్ చేసిన వారిలో సౌతాఫ్రికాకు చెందిన థామస్‌ను వారం రోజుల పాటు, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, డాక్టర్ కృష్ణ చైతన్యను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు.