AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ గనులు లేక నష్టాలు చవి చూస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో తగిన ఇనుప ఖనిజ బ్లాకులను కేటాయించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇనుప ఖనిజ బ్లాకుల కేటాయింపులపై నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేష్ట ఆయోధ్య రాము ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇక, ఈ వ్యాజ్యం విచారణార్హతపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో దాని గురించి కౌంటర్లో ప్రస్తావించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎ. సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ గనులు లేకపోవడం వల్లే వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఖనిజం కొనుగోలు చేస్తోందని, ఇది ప్లాంట్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోందని వివరించారు. క్యాప్టివ్ గనుల కేటాయింపులనకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర, రాష్ట్రాలకు వినతి పత్రాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం భారీ నష్టాలను చవిచూస్తోందని, దీనిని ప్రభావం ఉద్యోగులపై పడుతోందని వివరించారు. 2012లో ఉక్కు కర్మాగార కార్మిక సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, 2013 జనవరి 28న హైకోర్టు ఉమ్మడి తీర్పునిస్తూ.. వినతి పత్రాల్లోని అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించిందని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తగిన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆచరణలో సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాది పి. శ్రీరాం స్పందిస్తూ, పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రాలకు, ఈ వ్యాజ్యంలో చేసిన అభ్యర్థనకు సంబంధం లేదన్నారు. ఈ పిల్‌కు విచారణార్హత కూడా లేదని, సమయం ఇస్తే దీనిపై తగిన వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!