NTV Telugu Site icon

Varudu Kalyani: చంద్రబాబు ద్రోహం చేస్తే.. జగన్ రాజకీయ హక్కులు కల్పించారు

Varudu Kalyani

Varudu Kalyani

Varudu Kalyani Fires On Chandrababu Naidu: బీసీలకు చంద్రబాబు ద్రోహం చేశారని, కానీ సీఎం జగన్ మాత్రం రాజకీయ హక్కులు కల్పించారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు. జగన్ సామాన్యులకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఒక బీసీ మహిళగా జగన్ దగ్గర పని చెయ్యడం గర్వంగా ఉందన్నారు. బీసీలు జగన్‌కి వెన్నముకగా ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు తమ గొంతు వినిపించే రోజులు త్వరలోనే రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు చట్టసభల్లో మాట్లాడే అవకాశం జగన్ కల్పించారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉనప్పుడు మత్స్యకారులకు అన్యాయం చేశారని.. కానీ జగన్ మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు.

Allari Naresh: పోలిసోడి ఫ్యామిలీని టచ్ చేస్తే ఆ మాత్రం వయోలెన్స్ ఉండాలి…

11 మంది బీసీలకి జగన్ మంత్రి పదవులు ఇచ్చారని.. శాసనసభలో స్పీకర్ పదవి కూడా బీసీ నాయకులకే ఇచ్చారని కల్యాణి పేర్కొన్నారు. జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు సామాజిక న్యాయపాలన చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పదవులు కూడా చంద్రబాబు హయాంలో డబ్బున్న అగ్రవర్ణాల వరకే ఇచ్చారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో చాలావరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్లకే అవకాశాలిచ్చారని చెప్పారు. వెనుకబడిన వర్గాలకి 1లక్ష 92 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని.. జగన్ పాలనలో వెనుకబడిన కులాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. వైసీపీ పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ అని అభివర్ణించారు. మూడున్నరేళ్లలోనే జగన్ 98 శాతానికి పైగా ఎన్నికల హామీలనను అమలు చేశారన్నారు.

CM Jagan: లా నేస్తం నిధుల విడుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం

అంతకుముందు.. జగన్ పాలన చూసి చంద్రబాబు బృందానికి దిక్కుతోచక, మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని వరుదు కల్యాణి మండిపడ్డారు. మరోసారి మహిళల జోలికొస్తే చెప్పులతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనకు సంబంధించి సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ టీడీపీ ప్రచురించిన పుస్తకాన్ని తప్పుపట్టారు. టీడీపీని, పదవిని, పార్టీ ఆస్తులన్నింటినీ లాక్కుని.. ఎన్టీఆర్‌ మరణానికి కారకుడైన నారావారి నారీమణి ఎవరు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుకు కత్తి అందించిన నారీమణి ఎవరని తాము పుస్తకాలు ముద్రించలేమా? అని రివర్స్ ఎటాక్ చేశారు.

Show comments